వరుణదేవా.. కరుణించవా.. అంటూ కప్పతల్లి ఆటలు
. . . గ్రామదేవతలకు జలాభిషేకాలు, నైవేద్యాలు ఇందల్వాయి, బతుకమ్మ : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని దేవతలకు జలాభిషేకాలు చేసి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని ప్రార్థిస్తూ కప్పలను తడి వస్త్రంలో తీసుకొచ్చి కర్రకు కట్టి, డప్పు చప్పుళ్ల మధ్య "కప్పతల్లి.. కప్పతల్లి.."...