Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 4:44 pm Posted by : ramakrishna

స్నేహం ఒక విలువైన బహుమానం

  • 15 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక

 

మోర్తాడ్, బతుకమ్మ : స్నేహం ఒక విలువైన బహుమానమని అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుందని పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ధర్మపురి అన్నారు. శుక్రవారం  2009-10 సంవత్సరం10వ తరగతి బ్యాచ్ నిర్వహించిన ఆత్మీయుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే చెట్టు నీడన చదువుకున్నారు. బాల్యాన్ని ఆటపాటలతో గడుపుతూ సంతోషంగా చదువుకున్నారు. ఉన్నత చదువులకై వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుకొని జీవితాల్లో స్థిరపడ్డారు. 15 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి  జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,దేవ శ్రీనివాస్, సాధిక్, రాము, గోపీనాథ్, రవికుమార్, గంగాధర్, రవీందర్, 2009-10 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.