Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 6:40 pm Posted by : ramakrishna

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

మోర్తాడ్, బతుకమ్మ: క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెంపొందుతుందని మోర్తాడ్ విద్య అధికారి సమ్మిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరులో పెంపొందాలని పేర్కొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు జగధీశ్వర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, పి ఆర్ టి యు నాయకులు రాములు, అమ్మ ఆదర్శ చెర్మెన్ పద్మ,సలాం, ప్రధానోపాధ్యాయులు ప్రమీల రాణి,ఉపాధ్యాయులు,విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.