కిషోర బాలికల కోసమే స్నేహా సంఘాలు
వేల్పూర్, బతుకమ్మ : 13 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క కిశోర బాలిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్నేహ సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని వేల్పూర్ మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరోజీనీ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్నేహ సంఘాల సభ్యుల సమావేశంలో కిషోర బాలికలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కిశోరా బాలికలకు రక్షణ, పౌష్టికాహారం,సాధికారత వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించే లక్ష్యంతో పాటు...