వేల్పూర్, బతుకమ్మ :
13 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క కిశోర బాలిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్నేహ సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని వేల్పూర్ మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరోజీనీ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్నేహ సంఘాల సభ్యుల సమావేశంలో కిషోర బాలికలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కిశోరా బాలికలకు రక్షణ, పౌష్టికాహారం,సాధికారత వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించే లక్ష్యంతో పాటు భవిష్యత్తు పై తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రత్యేకంగా కిశోరా బాలికలతో స్నేహ స్వయం సహాయక సంఘాలను ఐకెపి ద్వారా ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూన్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపు సమావేశాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివోఏ కవిత, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
