Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 8:15 pm Posted by : ramakrishna

స్నేహానికి గుర్తుగా దోస్తుల గాజులు

మోర్తాడ్, బతుకమ్మ : ఆత్మీయులు ఒకరినొకరు కలుసుకొని సంతోషంగా గడుపుతూ స్నేహానికి గుర్తుగా దోస్తుల గాజులు ధరించుకోవడం  పల్లెల్లో, పట్టణాల్లో అలరిస్తున్నాయి. స్నేహితులతో పాటు తోడికోడళ్ళు, ఆడపడుచులు, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు స్త్రీలు తమ స్నేహితులతో కలిసి గాజులను మార్చుకుంటూ, గోరింటాకు పెట్టుకుని కలిసి భోజనాలు చేసుకుంటూ స్నేహ బంధాలను పదిలం చేసుకుని వాటిని ఒక దృఢమైన సంబంధంగా మార్చుకోవదానికి ఈ కార్యక్రమం వేదికయింది. ఈ కార్యక్రమానికి మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలోని మహిళలు సాంప్రదాయ బద్ధంగా అలంకరించుకొని వివిధ రకాల పాటలకు డ్యాన్సులు చేస్తూ, కుర్చీ ఆట, కర్చిఫ్ ఆట, వన్ మినిట్ గేమ్స్, బెలూన్ పేల్చడం వంటి ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపారు.

Friends' glasses as a symbol of friendship