Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 5:13 pm Posted by : ramakrishna

స్నేహితుల గాజుల సంబరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహితుల గాజులు అనేది స్త్రీలు తమ స్నేహితులతో కలిసి గాజులను మార్చుకుంటూ, గోరింటాకు పెట్టుకుని, కలిసి భోజనాలు చేసుకుంటూ జరుపుకునే ఒక సాంఘిక సంబరాన్ని సూచిస్తుంది. ఈ సంబరాలు స్నేహబంధాలను పదిలం చేసుకుని, వాటిని ఒక దృఢమైన బంధంగా మార్చుకోవడం ఈ సంబరం ముఖ్య ఉద్దేశ్యం. ఇది స్నేహం ఎప్పుడూ విడిపోని బంధం అని గుర్తు చేస్తుంది. నిజామాబాద్‌లోని బొబ్బిలి వీధి లో గల్లీ గణేష్  మండలి ప్రాంగణంలో ఈ సంబరాన్ని ఘనంగానిర్వహించుకున్నారు. అనంతరం ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరాన్ని చేసుకొని మురిసిపోయారు. మహిళలు కబడ్డీ, ఖో ఖో, దాండియా, డాన్స్ లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత,రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల మరియు గల్లీ వాసులు పాల్గొన్నారు.

Friends' glass celebration

Friends' glass celebration