Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 5:06 pm Posted by : ramakrishna

జీప్‌లతో ఢీ కొట్టుకొన్న స్నేహితులు

 

. . . యువతి వ్యవహారంలో మనస్పర్థలు కారణం

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం పైట్.. ఓకరి పైఓకరు దాడి చేసుకోవడం. కాదు కుడదు అంటే కత్తులు, రాడ్లతో దాడి చేసుకోవడం. అది కాదు అంటే ఒకరిపై ఓకరు ఎదురు కాల్పులు జరుపుకోవడం. కాని ఇవేవి లేకుండా కుడా ధ్వంధ యుద్ధం చేశారు  ఇద్ధరు యువకులు. కేవలం రెండు కార్లతో పరస్పరం డికోట్టుకోని కోత్త యాక్షన్ సీన్ కు తేర లేపారు.వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి.. నడిరోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే వరకు వెళ్లింది. అవి ధ్వంసమైన.. పగ, కసి చల్లారక.. రాడ్లతో దిగి కలియబడ్డారు. ఈ ఘటన చూసి.. రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్‌ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడలో హైటెన్షన్‌ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది..

Friends collided with jeeps
Screenshot

తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి.విజయవాడలోని భారతీనగర్‌కు చెందిన బోల్లా ఓమ్‌.. తన తండ్రితో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చూసుకుంటున్నాడు.. ఓమ్, రోహిత్‌ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్‌కు ఓమ్‌ ఫోన్‌ చేశాడు. ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తాను పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్‌లోని హైటెన్షన్‌ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.ఓమ్‌.. తన థార్‌ జీప్‌పై రోహిత్‌ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్లాడు. రోహిత్‌ జీప్‌ను ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఇలా ఢీ కొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. యాక్షన్‌ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్‌ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు.. భీతావహ దృశ్యాలను చూసి భయాందోళన తో పరుగులు తీశారు. అప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీప్‌లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలకొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి జీప్‌ను వదిలేసి రోహిత్‌ పరారయ్యాడు. ఓమ్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు తెలిసింది.

Friends collided with jeeps