జిమ్ ట్రైనర్‌ను డంబుల్స్‌తో కొట్టి చంపిన స్నేహితులు
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ: జిమ్ ట్రైనర్‌ను స్నేహితులు డంబుల్స్‌తో కొట్టి చంపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ వీరారెడ్డి నగర్‌లో జెస్ట్ ఫిట్ జిమ్ నిర్వాహకుడు, కోచ్ కిషోర్ (35)పై డంబుల్స్‌తో నలుగురు వ్యక్తులు దాడి చేశారు. కిషోర్ జిమ్ లో ఉండగా అతని స్నేహితుడు చంటి, మరో ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ కిషోర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.