తిర్మన్ పల్లిలో ఫ్రైడే డ్రై డే

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని  ఏఎన్ఎం శారద, ఆశా వర్కర్ భాష జ్యోతిలు  ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటూ అవగాహన కల్పించారు.నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  సూచనల మేరకు ప్రతి 'శుక్రవారం  ఫ్రైడే డ్రైడే , నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు డెంగ్యూ దోమల వృద్ధికి అనుకూలంగా...