Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 6:11 pm Posted by : ramakrishna

తిర్మన్ పల్లిలో ఫ్రైడే డ్రై డే

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని  ఏఎన్ఎం శారద, ఆశా వర్కర్ భాష జ్యోతిలు  ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటూ అవగాహన కల్పించారు.నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  సూచనల మేరకు ప్రతి ‘శుక్రవారం  ఫ్రైడే డ్రైడే , నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు డెంగ్యూ దోమల వృద్ధికి అనుకూలంగా మారిన నేపథ్యంలో, గృహాలు, కార్యాలయాల పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించి, దోమల సంతానోత్పత్తిని అరికట్టాలని ప్రజలను  సూచించారు.డెంగ్యూ దోమలు పగటిపూట కూడా కుట్టే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులకు దోమ తెరలు అమర్చుకోవాలని, పడకలు, ఉయ్యాలలకు కూడా దోమల వలలు ఉపయోగించాలని సూచించారు. దోమల నివారణ మందులను వాడాలని, ఇంటి పరిసరాల్లోని మురుగునీటి కాలువల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు కూడా పెరుగుతున్నందున, ప్రజలు మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని  ప్రజలకు సూచించారు.భోజనానికి ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానుకోవాలన్నారు.గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు వైరల్ ఫీవర్లు, వంటి గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. “అనారోగ్యంతో ఉన్నవారితో కరచాలనం చేయకుండా ఉండటం, చేతికి శానిటైజర్లను ఉపయోగించడం, తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు రుమాలు ఉపయోగించడం వంటి ప్రాథమిక దగ్గు నియమాలను పాటించాలన్నారు.కాలానుగుణంగా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు  ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో  ఏఎన్ఎం శారద,ఆశ వర్కరు పాశం జ్యోతీలు ఉన్నారు.

Friday is a dry day in Tirmanpalli