. . . ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం
. . . వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కాంగ్రెస్ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ భాష, వార్డు ఆఫీసర్ రోహిత్ కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా చూడాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కూలర్లు, పూల కుండీలు, ట్యాంకులు, నీటి పాత్రలు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా శుభ్రపరిచే చర్యలు చేపట్టారు.కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్ మాట్లాడుతూ డెంగ్యూ,చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.