ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి హాజరయ్యారు అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహ రెడ్డి మాట్లాడుతూ తాను గవర్నమెంట్ పాఠశాలలో చదివానని, జూనియర్, డిగ్రీ కళాశాల విద్య ను ప్రభుత్వ కళాశాల లో చదివానని తెలిపారు. మీరు కూడ కష్టపడి మంచి ప్రభుత్వ ఉద్యోగం పొంది తల్లి తండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మి నారాయణ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణం, కళాశాల క్యాంపస్ లో మొదటి ప్రాధాన్యత చదువుకు ఇస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి సెమిస్టర్ పరీక్షలు రాసి అందరు పాస్ కావాలని తెలిపారు. కళాశాలలోని విద్యార్థులకు అన్ని అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థుల అభ్యున్నతి కొరకు లైబ్రరీ అందుబాటులో ఉందని అందులో హిందూ పేపర్ ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు సుబ్క్రైబ్ చేశామని తెలిపారు. విద్యార్థులు పేపర్ చదివి ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవ్వాలి అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యం.చంద్ర కాంత్, కామర్స్ విభాగం అధిపతి శివ కుమార్ సార్, నాగనీక మేడం, గంగారెడ్డి సార్ లు అధ్యాపకులు డాక్టర్ సిద్దురాజు,కృష్ణప్రసాద్,శశిధర్,చంద్ర కాంత్, సంతోష్, డాక్టర్ గోదావరి, రాణి మేడం, సురేష్ రెడ్డి,సంగీత,కీర్తి స్వప్న,కిరణ్ కుమార్, మోయిన్, దశరథ్, మహమూద్,మరియు కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.