అభయ హస్తం ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని అభయ హస్తం సోసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ అందించారు. ఈ సందర్బంగా అభయ హస్తం సోసైటీ వ్యవస్థాపకులు  బర్ల మధుకర్ మాట్లాడుతూ.. చనిపోయిన వారి  మృతదేహాలను ఉంచడం కోసం  ఫ్రీజర్ బాక్స్ ను  సంజీవని ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ అవసరాల నిమిత్తం సంజీవని ఆసుపత్రిలో  ఇరువై నాలుగు గంటలు  అందుబాటులో ఉంటుందని ఈ ఫ్రీజర్ బాక్స్  ఉచితంగా తీసుకెళ్లవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లల మోహన్...