Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 5:14 pm Posted by : ramakrishna

స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమం తొలితరం ఉద్యమకారులు, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, దౌర్ సాయిలు, శేఖర్, జక్రి నరేందర్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.