Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 9:00 pm Posted by : ramakrishna

మద్దల్ చెరువులో ఉచిత పశు వైద్య శిబిరం 

 బతుకమ్మ పిట్లం :పిట్లంమండలం మద్దెలచెరువు గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.  పశుగణ అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో గర్భకోశ వ్యాధులకు 22 కృత్రిమ గర్భధారణ 2 సాధార చికిత్స ఐదు దూడలకి నటల నివారిణి 21 మొత్తం 50 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ  శిబిరానికి మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్  రైతులకు ఇటువంటి గర్భకోష చికిత్స శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్రులు భీమ్ సింగ్, సంగమేశ్వర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.