రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వేసవి శిక్షణ తరగతులను తహసీల్దార్ తారాబాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ.. రైట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్, రైడ్స్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం, రైడ్స్ సభ్యులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.