Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:24 pm Posted by : ramakrishna

బోధన్ యువకుడికి ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణం 18వ వార్డ్ అంబేద్కర్ కాలనీకి చెందిన సాయి వర్ధన్ ఎంబీబీఎస్ లో ఉచిత సీటు సాధించాడు. సామాన్య కుటుంబానికి చెందిన ఈ యువకుడు ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ ప్రవేశం పొందిన విషయం తెలిసిన బోధన్ మండల కేంద్రంలోని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రమోద్ (చిన్న చిత్రల )పలువురు  పెద్దలు అతనిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రమోద్  (చిన్న చిత్రల) మాట్లాడుతూ – “పేద కుటుంబానికి చెందిన సాయి వర్ధన్ వంటి విద్యార్థి కృషితో ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తన చదువుకు మరింత ఊతం అందించేందుకు సత్సమాజం ముందుకు రావాలి అని ప్రజాహితం గల దాతలు ఎవరైనా సహకారం అందిస్తే ఈ కుర్రాడు భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవ చేయగలడు” అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు, ప్రాంతీయ యువత పాల్గొన్నారు.