Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 3:57 pm Posted by : ramakrishna

ఎంబీబీఎస్‌లో బోధన్ యువకుడికి ఉచిత సీటు

బతుకమ్మ, బోధన్: సాధారణ కుటుంబం నుంచి వచ్చినా అసాధారణ విజయం సాధించాడు బోధన్ యువకుడు సాయి వర్ధన్. అంబేద్కర్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి కృషి, పట్టుదలతో ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించి బోధన్ పేరు గర్వంగా నిలబెట్టాడు. సాయి వర్ధన్ విజయాన్ని గుర్తించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడపాటి ప్రకాశ్ రెడ్డి సన్మానం చేసి నగదు సాయం అందజేశారు. “ఇలాంటి ప్రతిభావంతులు భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వీరిని ప్రోత్సహించడం మన అందరి బాధ్యత” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పసుపులేటి గోపి కిషన్, శిర్ప సుదర్శన్, కోల ఇంద్రకరణ్, రావుభా గంగాధర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. సాయి వర్ధన్ విజయం ఇప్పుడు బోధన్ యువతలో స్ఫూర్తి నింపుతోంది.

Free seat for Bodhan youth in MBBS