ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
రుద్రూర్, బతుకమ్మ : జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని బోప్పాపూర్ గ్రామంలో ఆవులు, గేదలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో 48 పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.