దోన్ పాల్ లో ఉచిత గాలి కుంటు నివారణ టీకాలు

  మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ  ఆద్వర్యంలో సోమవారం మోర్తాడ్ మండలంలోని  దోన్ పాల్ గ్రామంలో ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు వేసినట్లు పశువైద్య అధికారి గౌతమ్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం  142 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్ గౌడ్ , ముత్యాల రమేష్, గోడూర్ శేఖర్, కె.దేవన్న, గంగుల సతీష్ ,  పశుసంవర్ధక శాఖ సిబ్బంది ప్రభాకర్, ప్రభాస్ తదితరులు  పాల్గొన్నారు.