ఉచిత మెగా వైద్య శిబిరం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారిచే ఉచిత వైద్య సేవలు అందించారు. రుద్రూర్ మండల తహసీల్దార్ సురేందర్ నాయక్ చేతులమీదుగా కాన్సర్ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది. ఎంపిడిఓ సురేష్ కుమార్ చే కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందుకు ప్యాప్స్మియర్ టెస్టులు, మమోగ్రామ్ టెస్టులు, ఎక్స్రేలు,...