Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 7:01 pm Posted by : ramakrishna

ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనంలో గురువారం బోధన్ లయన్స్ జనరల్ ఆసుపత్రి, లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎండి జనరల్ డాక్టర్, ఎంబిబిఎస్ డాక్టర్, ఆప్థోమలాజిస్ట్ ఆఫీసర్, ఆప్తోమెట్రిస్ట్ లచే వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా అవసరమైన వారికి ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 188 మంది రోగులు చికిత్సలు చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో 16 మందికి కంటి శుక్లాలు ఉండటాన్ని గుర్తించి వారికి లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ గుండురు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఈనాటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన లయన్స్ జనరల్ ఆసుపత్రి, లైన్స్ కంటి ఆసుపత్రి వైద్యులకు, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్  ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ లయన్స్ గవర్నర్ లయన్ పోలవరపు బసవేశ్వర రావు  కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో లయన్స్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు అరుణ్ కుమార్ ఎండి ఫిజీషియన్, డాక్టర్ కృష్ణ ఎంబిబిఎస్, డాక్టర్ గణేష్ కులకర్ణి ఎమ్మెస్ ఆప్తమాలజస్ట్ ఆఫీసర్, డాక్టర్ ప్రవీణ్ ఎండి డిసిహెచ్, కె.అజయ్ ఆప్తోమెట్రిస్ట్, ఆసుపత్రుల సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, జిల్లా జిఎస్టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడ్, జిల్లా అధ్యక్షులు లయన్ కెవి మోహన్, క్లబ్ ఉపాధ్యక్షులు పత్తి రాము, క్లబ్ సభ్యులు పుట్టి సాగర్, పుట్టి సందీప్, శ్రీకాంత్ గౌడ్, తాహేర్, మచ్కూరి రమేష్,  సాయికుమార్, బోజుగొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.