Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 7:34 pm Posted by : ramakrishna

నందిపేట్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

 

. . . సుమారు 425 మందికి పరీక్షలు

 

నందిపేట, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం, ఉప సర్పంచ్ వేణురి రామచంద్ర హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, పేద ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామంలో ఉన్న ప్రజలందరూ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో నందిపేట గ్రామంలో ఉన్న సుమారు 425 మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచిత మందులను అందజేశారు. అదే విధంగా వెల్ నెస్ హాస్పిటల్స్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ హెల్త్ కార్డులను 500 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు (ఆర్థోపెడిక్ విభాగం), డాక్టర్ అపర్ణ (జనరల్ మెడిసిన్ విభాగం), డాక్టర్ మమతా రెడ్డి (గైనకాలజీ డిపార్ట్ మెంట్), డాక్టర్ సుశాంత్, డాక్టర్ షాదాబ్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, ఏజీఎం ఆపరేషన్ – వినోద్ కుమార్, గ్రామ ప్రముఖ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, సుభాష్ గౌడ్, శ్రావణ్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ సయ్యద్, ముస్లిం మైనారిటీ నాయకులు, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

 

Free mega medical camp in Nandipet