Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 4:21 pm Posted by : ramakrishna

కస్తూర్బా గాంధీ విద్యార్థినిలకు ఉచిత వైద్య పరీక్షలు..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 డేస్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు దంత వైద్య పరీక్షలు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ శిబిరంలో 206 మంది విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, పీడియాట్రిషన్ డా. కె.భాస్కర్, ఆర్ బిఎస్ కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్, దంతవైద్య నిపుణులు అనిల్ కుమార్, ఆప్తమాలిస్ట్ డా. రమేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ అయోషా సిద్దిక, డివై డిఎంహెచ్ ఓ వో డా. సమత, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్  బి.శ్యామల, ఎస్ఓ సుమతి, సూపర్వైజర్ రవి, ఏఎన్ఎంఎస్ గౌరీ, శ్రీలత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.