Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:15 pm Posted by : ramakrishna

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

 

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండల కేంద్రంలోని సిసిడిలో మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బోధన్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే థైరాయిడ్, బీపి, షుగర్, కంటి వైద్య పరీక్షలు, ఈసీజీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 175 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డా. రామకృష్ణ, కంటి వైద్య నిపుణులు డా. ఓమి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పివి.సుబ్బారావు, ట్రస్ట్ మేనేజర్ కామెపల్లి ఠాగూర్, శివరాజు, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.