Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 4:26 pm Posted by : ramakrishna

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, బతుకమ్మ : వాసవి క్లబ్ బిబిపేట నందు ఆర్వీఎం హాస్పిటల్ ములుగు వారు వాసవి క్లబ్, బీబీపేట, వీటీ ఠాకూర్ మెమోరియల్ సహకారంతో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.  ఈ వైద్య శిబిరంలో 365 మందికి  పరీక్షలు చేశారు. వారిలో 72 మందిని వారి ఆర్వీఎం హాస్పిటల్ కు శుక్రవారం ములుగు తీసుకువెళ్లి, రోగులకు కావలసిన పరీక్షలు, అవసరమైతే ఆపరేషన్లు చేసి పంపిస్తామని ఆర్వీఎం నిర్వాహకులు లక్ష్మణ్, సంతోష్, మురళి, గణేష్ తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో వాసవి క్లబ్ బిబిపేట అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, పెద్ది నాగేశ్వర్, ఎర్రం ప్రసాద్, బచ్చు రామచంద్రం, చంద్రశేఖర్, వాసవి క్ల బ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ పాల్గొన్నారు.