లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బోయి సంఘంలో శుక్రవారం రోజున ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, దంత వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ శిబిరంలో 126 మంది రోగులకు వైద్య సేవలను అందించారు. ఇందులో 32 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నందున ఉచిత కంటి ఆపరేషన్...