Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 5:15 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని బోయి సంఘంలో శుక్రవారం రోజున ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, దంత వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ శిబిరంలో 126 మంది రోగులకు వైద్య సేవలను అందించారు. ఇందులో 32 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నందున ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తము బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, లయన్ గాండ్ల మధు, మంజరి సీతారాం, మంజరి రాజు, బోయి సంగం అధ్యక్షులు సాయిలు, లక్ష్మణ్, ఉరడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Free medical camp organized by Lions Club of Rudrur