Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 7:23 pm Posted by : ramakrishna

దాత్రిశ్రీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: దాత్రిశ్రీ ఫౌండేషన్,  లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో గురువారం రోజున  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని,  ఇందులో హార్ట్ స్పెషలిస్ట్, జనరల్ డాక్టర్, కంటి స్పెషలిస్ట్, దంత వైద్యులు నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి,  లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్, రుద్రూర్ లలిత ఆసుపత్రి వారిచే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిదంగా బిపి టెస్టులు, షుగర్ టెస్టులు, ఈసీజీ టెస్టులు, అవసరమైన రోగులకు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున  పరిసర గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను వినియోగించుకోవాలని నిర్వహణ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజెశారు.