నీలకంఠ నగర్ లో ఉచిత వైద్య శిబిరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యూపీహెచ్సీ సీఎస్ కాలనీ వైద్యాధికారి ఆధ్వర్యంలో నగరంలోని నీలకంఠ నగర్ లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఉచిత అవుట్‌పేషంట్ కన్సల్టేషన్, ల్యాబ్ సేవలు, మందుల పంపిణీ, అవసరమైతే రిఫరల్ వంటి సేవలు అందించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలలో చేర్పించడానికి ప్రోత్సహించారు. మత్తు పదార్థాలవల్ల కలిగే వ్యసనం నివారణ, సమతుల్య మానసిక ఆరోగ్య అవసరం గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అన్ని...