గన్నారంలో ఉచిత వైద్య శిబిరం

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో కంజర యాత్ర సందర్భంగా అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ విమలాకర్ రెడ్డి నేతృత్వంలో గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను పొందారు. శిబిరంలో వైద్య బృందం ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సలహాలు అందించింది.  ...