మోపాల్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మోపాల్ మండలంలోని కాల్ పోల్ గ్రామంలో నమోదైన జ్వరాల చికిత్స కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిస్టిక్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుకారం రాథోడ్, డిస్టిక్ సర్వేలెన్సు ఆఫీసర్ డాక్టర్ నాగరాజు, డిస్టిక్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్,స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డా .అజ్మల్, డాక్టర్ ప్రత్యూష సిబ్బంది చేత వైద్య బృందాన్ని కాల్ పోల్ గ్రామానికి పంపించి నూతనంగా నమోదు అవుతున్న జ్వరాలపై ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆశాల ద్వారా జ్వర సర్వేను గృహ సందర్శన ద్వారా చేసి, ప్రతి ఒక్కరికి జ్వరాలపై అవగాహన కలిగించారు. గ్రామంలో నెలకొన్న నీటి నిల్వలను తొలగించడం, యాంటీ లార్వల్ మెజర్స్ నిర్వహించడం, టెమీపాస్ స్ప్రే చేయడంతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 152 మందికి పరీక్షించి 28 మందికి ఆర్డిటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురికి నిర్ధారణ కోసం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ కి శాంపిల్స్ పంపించారు. యాంటీ లార్వల్ ఆపరేషన్ మొత్తం 105 గృహాలలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జ్వరాలు తగ్గేవరకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి వైద్య సిబ్బందితోపాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
