గురుకుల పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం లో గల గురుకుల పాఠశాలలో ఆరోగ్య భిక్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండల మెడికల్ అధికారి దివ్య తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రఘు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది సతీష్ ఆశ వర్కర్లు విద్యార్థులు తదితరులు...