Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 5:07 pm Posted by : ramakrishna

సుల్తాన్ పేట్ లో ఉచిత కంటి పరీక్షలు

మద్నూర్, బతుకమ్మ:

 

మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, వైద్యం కార్యక్రమాన్ని నేత్ర ఐ కేర్ బిచ్కుంద వారి ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ సాయికుమార్ నిర్వహించారు. కంటి సమస్యలు పరీక్షించి వారికి కావాల్సిన మందు చుక్కలు ఉచితంగా అందించారు. గ్రామ ప్రజలు యువకులు తదితరులు ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సుల్తాన్ పేట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ డాక్టర్ సాయి కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్ రాజ్, మాజీ సర్పంచ్ రాములు, శివరాజ్ పటేల్, యూత్ ఫోరం సభ్యులు, తదితరులు ఉన్నారు.

 

Free eye tests in Sultanpet
Free eye tests in Sultanpet