Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 5:34 pm Posted by : ramakrishna

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారి సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 78 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా 16 మంది రోగులకు కంటిలో మోతె బిందు ఉన్నట్టు గుర్తించి వారికి లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కె.వి.మోహన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, కార్యదర్శి గుండూరు ప్రశాంత్ గౌడ్, క్లబ్ కార్యవర్గ సభ్యులు లయన్ కటికే రామ్ రాజ్, గ్రామవాసులు సతీష్ గౌడ్, లయన్స్ కంటి ఆసుపత్రి కంటి నిపుణులు అజయ్ గౌడ్, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.