సీహెచ్‌సీ ఎల్లారెడ్డిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సీహెచ్‌సీ లో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 41 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కంటి శుక్లాల క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న 7 మంది రోగులను శస్త్రచికిత్స కోసం బాన్సువాడలోని లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అలాగే 21 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి వాటిని సూచించారు. మరింత ప్రత్యేక వైద్యం అవసరమైన...