రుద్రూర్, బతుకమ్మ :
రాఖీ పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా రాఖీలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పార్వతి మురళి, అడప నవీన్ మాట్లాడుతూ సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక, రాఖీ పండుగ అని అన్నారు. రుద్రూర్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మండల ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వమని తెలిపారు. అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ల ఎనలేని అనుబంధం అన్నారు. సహోదరత్వానికి ప్రతీకగా నిలిచిన రక్షా బంధన్ పర్వదినం, భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ, సాంస్కృతిక వేడుకగా నిలిచిందని వారు తెలిపారు.