Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:26 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఉర్దూ మీడియం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇంతియాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి నోటు పుస్తకాలు, సామగ్రికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. నిరుపేదలకు భారం అవుతుండడంతో ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం మానవతా ధృక్పదంతో నిర్ణయం తీసుకుందని అన్నారు. ఫలితంగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని, డ్రాపౌట్స్‌ కూడా తగ్గవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుమవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పిల్లలపై శ్రద్ధ వహించి విద్యార్థుల విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సయ్యద్ సలీం, ఉప సర్పంచ్ షేక్ షాదుల్, మాజీ కోఆప్షన్ సభ్యులు దస్తగిరి, మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, వార్డ్ సభ్యులు అలీం ఖాన్, హుసేన్ ఖాన్, షేక్ గౌస్ లింగన్ గౌడ్, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్సర్ , ఉపాధ్యాయులు ఆసిఫ్, తబస్సుమ్, నజిమా బేగం తదితరులు పాల్గొన్నారు.