బతుకమ్మ, పిట్లం : మండలం రాంపూర్ గ్రామంలో ఉచిత గర్భ కోషవ్యాధుల చికిత్స శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ శిబిరంలో పశు ఘన అభివృద్ధి సంస్థ ఆధ్వర్య్ంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ యొక్క శిబిరంలో పశు ఘన అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మజీద్ హైమద్ ప్రారంభించారు ఈ శిబిరంలో 48 గర్భకోశ వ్యాధులు మూడు కృత్రిమ గర్భాధారణ సాధారణ చికిత్స, 7 నట్టల నివారిణి 23 మొత్తం 81 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో రైతులకు చలికాలంలో పశువులు ఎదకు వస్తాయి.కాబట్టి మీరు సకాలంలో గుర్తించి అందుబాటులో ఉన్న గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భాధారణ చేయించినట్లయితే మంచి మేలు దూడలు పుడతాయని తెలిపారు. ఉచిత గర్వకోశ వ్యాధుల చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోవాలని పశుఘన అభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి డాక్టర్ మజీద్ రైతులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్, సూపర్వైజర్ తిరుపతి, గోపాల మిత్రులు సంగమేశ్వర్,అంజని కుమార్, ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.