పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామంలో మంగళవారం పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ శిబిరంలో 99 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్చూరి పద్మ, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.