Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 3:49 pm Posted by : ramakrishna

30న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మే 30న శుక్రవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్టు కార్యదర్శి కే. రామ్మోహన్రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈ వి ఎల్ నారాయణ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అధ్యక్షులు శిరప హనుమాన్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. లంగ్స్, బ్రెస్ట్, గర్భాశయ తదితర భాగాలలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి ను ముందుగా గుర్తించలేకపోతున్నామని, అది అర్థమయ్యేసరికి నయం చేసుకోలేని పరిస్థితికి వస్తున్నారని, అందుకే ముందుగానే తెలుసుకునే ప్రయత్నం లో భాగంగానే ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఉద్యో గులు, మహిళలు, అంగన్వాడి, ఆశ, పేద, మధ్యతరగతి గృహిణిలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు జి. నరేందర్, ఎండి హమీదుద్దీన్, పురుషోత్తం రావు, శిల్ప లింగయ్య, బాలదుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Free cancer screening tests on the 30th