కిమ్స్, రోటరీ ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం కామారెడ్డిలో రోటరీ క్లబ్, కిమ్స్, ఐఎంఏ  వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య  శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విచ్చేసి ఈ ఉచిత క్యాన్సర్ శిబిరం ద్వారా  నిర్వహిస్తున్న వైద్య సేవలను పరిశీలించి  జిల్లాలో ఇలాంటి క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్,ఐఎంఏ,కిమ్స్ హాస్పటల్ వారిని అభినందించారు. పేద ప్రజల అధికంగా ఉన్న ఈ జిల్లాలో ఇలాంటి శిబిరాల...