Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 6:04 pm Posted by : ramakrishna

భీమ్ గల్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

భీమ్ గల్, బతుకమ్మ :  పట్టణ విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం, విశ్వకర్మ సంఘం. 2 సంఘాల ఆధ్వర్యంలో భీమ్ గల్ పట్టణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘ కార్యనిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించే ఈ శిభిరంలో నరాల వికినెస్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తదితర అన్ని రకాల రోగాలకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో చెకప్ కు వచ్చిన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తారని, పెద్ద పెద్ద జబ్బులు ఉన్న వారు డాక్టర్ వ్రాసి ఇచ్చే మందులు కొనుక్కోవాలని సూచించారు. 50 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్. వై. ప్రకాష్  నేత్రత్వంలో నిర్వహిస్తున్న ఈ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంఘ సభ్యులు కోరారు.