ఉచితంగా క్యాన్సర్ నిరోధక టీకాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గ్రెస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ విద్యార్థులకు ఉచితంగా క్యాన్సర్ నిరోధక టీకాలను ఇప్పించారు. ఆ కార్యక్రమాన్నినగరంలోని మాధవ నగర్ లో గల ఇందూర్ కాన్సర్ హాస్పిటల్ లో శుక్రవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా.రవీంధ్రనాథ్ సూరి, డా.ప్రద్యుమ్న రెడ్డి, డా.చైతన్య, డీఎల్ఎస్ఏ స్టాఫ్, బాలసదన్ ఉద్యోగులు పాల్గొన్నారు.