పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు..
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పశులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డా.సంతోష్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో 98 ఆవులు, గేదెలుకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.