Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 7:45 pm Posted by : ramakrishna

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పశులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డా.సంతోష్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో 98 ఆవులు, గేదెలుకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్,  ఉపసర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.