సౌదీలో మృతి చెందిన వలస కార్మికుడికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలోని తోర్తి గ్రామానికి చెందిన రాజారాపు సత్యనారాయణ ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెల రోజుల క్రితం ఆయన సౌదీలో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఇటీవల ఆయన మృతదేహం సౌదీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తోర్తి గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు అత్యవసరంగా అంబులెన్స్ సౌకర్యం అవసరమైంది. ఈ విషయాన్ని తోర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,...