Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 5:58 pm Posted by : ramakrishna

ఉచిత గాలి కుంటు టీకాలు

మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి గౌతమ్ రాజ్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా  115 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు   గంగాధర్, డోనగిరి స్వప్న, గంగారం,  పశుసంవర్ధక శాఖ సిబ్బంది ప్రభాకర్, జమిల్ , ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.