బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్. టి. పెద్దన్న దోస్త్ అడ్మిషన్స్ 2025 బ్రోచర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఉచితంగా దోస్త్ ఆన్లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొందాలని సూచించారు. రూ. 7.25 కోట్లతో 32 విశాల గదులతో ప్రకృతి ఒడిలో అత్యధిక సౌకర్యాలతో మోర్తాడ్ డిగ్రీ కళాశాల నిర్మితమైందని పేర్కొన్నారు. అలాగే త్వరలో అటానమస్ రాబోతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అన్ని కోర్సులు ఇంగ్లీష్ మీడియం లో కలవన్నారు. అధ్యాపకులు ఐదు బృందాలుగా మోర్తాడ్, కమ్మర్ పల్లీ,ఏర్గట్ల, వేల్పూర్, మెండోరా, భీమ్ గల్, మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ దశరథ్, సీనియర్ ఆధ్యాపకులు రాజయ్య, రవీందర్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.